Saturday, January 17, 2009

మా రి ష స్ మాయాజా లం

హిందూ మహా సముద్రంలో చిన్న ద్వీపం ఇటివల కాలంలో మన తెలుగు వార్తా పత్రికలలో ప్రముఖ స్థానం సంపాదించుకోవడం చాల ఆశ్చర్యకరం .ఇంతటి ప్రాచుర్యానికి గల కారణాన్ని పరిశీలిద్దాం .మన దేశం లోనికి వచ్చే విదేశి పెట్టుబడులలో సింహ భాగం ఈ దేశం నుండి వచ్చేవే .అన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టగలిగిన సామర్ధ్యం ఆ చిన్ని దేశానికీ ఎలా వచ్చిందని అశ్చర్య పోతున్నారా ?
అసలు తిరకాసు ఏమిటంటే విదేశి పెట్టుబడుదారులు తమ తమ దేశాలనుండి పెట్టుబడిని తీసుకుని వచ్చి తిరిగి వేరే దేశాలలో గాని లేక తమ సొంత దేశంలో ఇతర కంపెనీ ల లో గాని పెట్టు కోవడానికి అనుమతించడమే.పదిహేను లక్షల జనాభా కూడా లేని ఈ దేశం లో పదిహేను వందల కంపెనీ లు ఈ వ్యాపారం చేస్తున్నయంటే ఆశ్చర్యకరమే.మన రామలింగరాజు గారు కూడా సత్యం లో తన కుటుంబ వాటాలను ఇక్కడి తన కంపెనీ కి అమ్మి ఆ డబ్బును యావత్తూ ఈ దేశానికీ బదలాయించి మల్లి ఇక్కడి నుండి తన కుమారుల కంపెనీ'మయతస్' లో పెట్టుబడిగా భారత దేశానికీ పంపడం పచ్చి నిజం. జలయజ్ఞం లో ముడుపుల కధ కూడా ఇదేననడానికి ఆస్కారం ఉంది. భారత దేశం లోని నియంత్రణ వ్యవస్థ లను నీరు కార్చే ప్రయత్నాలను అడ్డుకొని వక్ర మార్గాలలో ఆర్జించే సంపదను అరికట్టడానికి ఉపయోగపడే చట్టాలను రూపొంది న నాడే మన దేశానికీ ప్రయోజనం కలుగుతుంది .

Sunday, January 11, 2009

వంశ పారంపర్యం - ప్రజా స్వామ్యం

ప్రజాస్వామ్యం అంటే ప్రజల వలన ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పరచ బడిన వ్యవస్థ గ నిర్వచించ బడిందని మనందరికీ తెలుసు .
కాని మన నాయకులకు మాత్రం అది వంశ పారంపర్యంగా అధికారాన్ని బదలాయించే ప్రక్రియగా కనబడితే మన మరియు మన దేశ భవిష్యత్తు ప్రమాదంలో పది నట్లే .దీనికి మూల కారాణాలను వెదకడం మన ప్రధమ కర్తవ్యం .
నా దృష్టిలో దీనికి మూల కారణం మానవ సహజమైన పుత్ర వా త్స్య లం అనిపిస్తుంది .ప్రతి తండ్రి తమ సంతానం తమ కంటే ఎక్కువ ఎత్తులో ఉండాలనుకోవడం తప్పుకాదు . కానీ దాన్ని సాధదించడానికి తమ రాజకీయ అధికారాన్ని ,రాజకీయ పదవులతో సంపాదించిన ధన్నాన్ని దుర్వినియోగం చేస్తే ప్రజా స్వామ్యానికి చేసే హాని అంతులేనిది .దీనిని చక్కదిద్దడానికి వ్యవస్థలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టాలి .దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి ఒక పదవిలో రెండు సార్లు కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేకుండా ప్రజా ప్రాతి నిద్యా చట్టాన్ని సవరించాలి.అలాగే సంపదను వంశ పారం పర్యం గా అనుభవించడానికి వీలు లేకుండా సంతానానికి డెబ్భై శాతం మిగిలిన ముప్పై శాతం ప్రభుత్వ ని కి చెందేటట్లు వారసత్వ చట్టానికి సవరణ చెయ్యాలి .ప్రతి పౌరుడు వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉండాలి .

Thursday, January 8, 2009

'సత్యం వధ -లెక్కలచెర '

కంపెనీ లెక్కలను చెరలోపెట్టి "సత్యం"ను వధించిన ఓ రామలింగరాజ నీ మేధా సంపత్తి అనన్యసామన్యం .అమితమైన. నీ పుత్ర ప్రేమ
53000 మంది ఉద్యోగుల భవితను ఆంధ కారం లోనికి నెట్టిన వైనం29000వేల కోట్ల కాంట్రాక్ట్లు నీ కొడుకులకు వచ్చిన వైనం 6800 ఎకరాల భూమి కేవలం నాలుగు సం వ త్స రాలలో సంపాదించిన వైనం తమ చరిత్రను చెప్పకనే చెప్పుతుంది .వాటాదారులను నట్టేట ముంచిన మీ చేష్టలను ,దేశ చట్టాలకు అనుగుణం గా శిక్ష అనుభ విస్తా నని చెప్పే మీ మాటలను మీకు సాయం చేసే మీ అధికార మిత్రులు నమ్మ వచ్చు నేమో గాని ఇతరులు ఎవ్వరు నమ్మరు . దేశ ప్రతిష్టను దిగ జార్చిన నీ నిర్వాకం స్టాక్ మార్కెట్
లోని మదుపు దారులందరికి ఒక గుణ పా టం .
దేశ కార్పొరేట్ రంగంలో ఇంక ఎంత మంది రామలింగరాజు లున్నరోనని భయ పడని వారుండరు .వీరి భయాన్ని పోగొట్టి ఆడిట్ అధికారాలను సమగ్రంగా నిర్వచించి మదుపు దారులలో విశ్వాసం నింపవలిసిన బాద్యత ప్రభుత్వానిది .

Tuesday, January 6, 2009

వోట్లు కురిపించే నోట్లు

కృష్ణ జిల్లాలోని ఉంగుటూరు మండలంలో నందమూరు సెగ్మెంట్ మండల ప్రజా పరిషద్ ఉప ఎన్నిక ఈ నెల నాల్గవ తేదిన జరిగింది.
ఈ సెగ్మెంట్ లో మొత్తం వోటర్లు సుమారు 2000. వివిధ రాజకీయ పక్షాలు ఈ సెగ్మెంట్ ఎన్నికకు చేసిన ఖర్చును చూస్తె ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యమా నీ పయనం ఎటు అని ప్రశ్నించుకోవాలి .ఈ ఎన్నికలో దాదాపు ఒక కోటీ రూపాయలను మంచి నీళ్ళలా ఖర్చు పెట్టిన
ప్రతి రాజాకీయ పక్షం ఆత్మవిమర్శ చేసుకోవలసిన సమయం ఆసన్నమైనది .
పదిహేనురోజులపాటు జర్గిన ఈ ఉపఎన్నిక ప్రచారహోరు లో పారిన మద్యం ఇతర ఖర్చులు చూసిన ప్రతి ప్రజా స్వామ్యవాడి సిగ్గుతో తలదించకోవాలి .ఇతర సెగ్మెంట్లలో సభ్యులను ఉపఎన్నికల కోసం రాజీనామా చెయ్యమని వత్తిడి చేస్తున్న వొటర్లును చూసి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థ్థి తి.ఎన్నికల తరువాత వ్యవసాయ కూలీలు దొరకక పోవడం ఈ పిచ్చి కి పరాకాష్ట.
ప్రతిష్ట కోసం ప్రజా స్వామ్మ్యాన్ని ఖూని చెయ్యవద్దని రాజకీయ పక్షాలను కోరుకోవడం మినహా మనం చేయ గలగినది మాత్రం ఏముంది .

Sunday, January 4, 2009

మహిళా నిరక్షరాస్యత నిర్ములనతో నవ సమాజాన్ని నిర్మిద్దాం

౨౦౦౧ జనాభా లెక్కల ప్రకారం భారత దేశంలో మహిళా అక్షరాస్యతా ౫౪%.కొన్ని రాష్ట్రాలలో పరిస్థితి మరి దారుణం
. బీహార్ రాజస్థాన్లలో ఇది ౧౮%.ఇదే పరిస్థితి కొనసాగితే సంపూర్ణ అక్షరాస్యతా సాధించడానికి మరో శతాబ్దం పట్టినా ఆశ్చర్యపడనక్కరలేదు .మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ని పరిశీలిస్తే ఎంతో కలవరం కలుగకమానదు .నూటికి యాభై శాతం మహిళలు నిరక్షరాస్యులే .మరి మన నాయకులేమి చేస్తున్నారు .మహిళా సాధికారత అంటు ఉకదంపుడు ఉపన్యాసాలతో ౬౦ సంవత్సరాల కాలాన్నీ వృధా చేసారు .ఇంకా చేస్తున్నారు .దీనికి కారణాలు వెదుకుతూ సమయాన్ని వృధా చేయడంకంటే కార్యాచరణకు పూనుకోవడం విజ్ఞుల లక్షణం .కార్యాచరణ ఎలా వుండాలి .
రాష్ట్రంలో నిరక్షరాస్యులైన మహిళలును శాస్త్రీయ పద్దతులలో గుర్తించాలి .
వయోజన మహిళా విద్యకు అధిక ప్రాధాన్యత .రాష్ట్రంలోని ప్రతి కళాశాల విద్యార్ధి కనీసం ౫ మంది మహిళా వయోజనులను అక్షరాస్యులుగా చేసే కార్యాచరణ పధకాన్ని అమలుచెయ్యాలి.
బాలికలందరికి సెకండరి విద్యను ఉచితంగా నిర్భందం గా అమలుచెయ్యాలి
బడి కి పంపడం తల్లి తండ్రుల బాధ్యత గా గుర్తిస్తూ అమలు చెయ్యని వారిని శిక్షించే హక్కును స్థానిక సంస్తలకిస్తూ శాసనం చెయ్యాలి
మహిళా సాధికారతకు తొలిమెట్టు మహిళా విద్యకు అధిక ప్రాముఖ్యం ఇవ్వడమేనని పాలకులు గుర్తించాలి

Saturday, January 3, 2009

భారతదేశం లో నూతన విద్యా విధానము ఆవశ్యకత

స్వాతంత్రం వచ్చి ౬౦ వసంతాలు గడచిన తరువాత కూడా సంపూర్ణ అక్షరాస్యతా దూరపు కలగానే మిగిలిపోయింది .విద్య ప్రాధమిక హక్కుగా గుర్తింపు పొందలేకపోయింది .దీనికి కారణాలు ఏమైనప్పటికీ ౨౧ వ శతాబ్డంలోనైన దేశ పౌరులందరికీ ప్రాధమిక విద్య కల్పించడం ప్రభుత్వాల కనీస బాద్యత .దీనికి తగిన కార్యాచరణ కు నడుం బిగించాలి .
విద్యను ప్రాధమిక హక్కు గా గుర్తిస్తూ రాజ్యాంగాన్ని సవరించాలి
విద్యను ఉమ్మడి జాబితాలో చేరుస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిని నిర్వచించాలి
జనాభాను దృష్టిలో ఉంచుకొని దేశాన్ని విద్యా జిల్లాలగా విభజించాలి
ప్రతి జిల్లాలో అన్ని ఆధునిక సదుపాయాలతో విద్యాలయలును నిర్మించాలి
విద్యాలయాలకు విద్యార్ధులను తీసుకురావడానికి ఉచిత రవాణా సదుపాయాన్ని కలుగచేయాలి
ఉన్నత పోషక విలువలతో కూడిన ఆహారాన్ని విద్యార్ధులందరికీ అందించాలి
జిల్లా లో ని విద్యాలయాలకు స్వయంప్రతిపత్తినిస్తూ ఆర్దికస్వయంపోషణకు పంచాయతి మరియు నగరపాలకసంస్తల
ఆదాయంలో కొంత భాగాన్ని కేటాయించాలి .
దేశంలో పుట్టే ప్రతి బిడ్డ పుట్టగానే సంబందిత విద్య జిల్లాలో నమోదు కావాలి
నమోదు అయిన ప్రతి బిడ్డను విద్యాలయాలలో చేర్పించడానికి విద్యా వాలంటీర్ల వ్యవస్థను నిర్మించాలి
విద్యాలయాలలో ఉన్నత ప్రమాణాలతో సిబ్బందిని నియమించాలి
రాష్ట్రలలోగల విద్యాలయాలను పర్యవేక్షించడానికి రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికార మండలిని నియమించాలి
విద్యాలయాలకు పిల్లలలును పంపడం తల్లి తండ్రుల బాధ్యతగా ప్రచారం చేస్తూ అలా పంపని తల్లి తండ్రులకు జరిమానా విధించే అధికారం స్థానిక సంస్థలకు దాకలు చెయ్యాలి
విద్యాలయాలలో ప్రవేశానికి కులము మతము నమోదు చెయ్యడాన్ని నిషేదించాలి
ఈ ప్రమాణాలతో సంస్కరణలను అమలు చేస్తే ౫ వసంతాలలో నూతన భారతాన్ని నిర్మించుకోగలం