Thursday, April 2, 2009

జగన్ గారి ఎన్నికల అఫడవిట్లో ఆస్తుల విలువ

రాష్ట్ర ముఖ్య మంత్రి గారి తనయుడు శ్రీ జగన్ గారు తమ ఎన్నికల నామినేషన్ దాఖలు చేస్తూ తమ ఆస్తుల విలువ ౭౭ కోట్ల రూపాయలు మాత్రమేనని ఎన్నికల అధికారికి సమర్పించిన అఫడవిట్లో పేర్కొన్నారిని వార్తా పత్రికలూ తెలియ చేసాయి.
అహ ఎంత మంచి చౌక బేరము. ఆదాయపన్ను విభాగము వారు నిద్ర మేల్కొని ౭౭ కోట్లు వెంటనే చెల్లించి వారి ఆస్తులను స్వాధీనము చేసుకొంటే ప్రభుత్వానికి ఎంత లాభము .అలాగే అనుమానం ఉన్న ప్రతి అభ్యర్ధి ని తమ ఆస్తుల వివరాల ప్రకారం నగదు చెల్లించి వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే నిబంధనను అమలులోనికి తెస్తే ప్రభుత్వ బడ్జెట్ లోటు ను ఈ ఎన్నికలతో పూరించుకోవచ్చండంలో
సందేహం లేదు.నిబంధనలను ఏర్పరిచింది ఉల్లన్ఘిన్చదానికే అనే మన ప్రజాస్వామ్యంలో సామాన్యుడి సణుగుడు పట్టించుకొనే నాయకులూ ఉంటారా ?

తీర్పు

ఎన్నికలోచ్చై,ప్రజా తీర్పు ఎలా ఉంటుందోనని అందరు ఆసక్తి గా
ఎదురుచూస్తున్న తరుణమిది.విజయం ధన బలానిదా లేక ప్రజాస్వామిక విలువల్ద
అని సందేహ పడుతున్నారా ,అలాంటి సందేహానికి తావు లేకుండా విజయం ధనానిదేనని బల్ల గుద్ది చెప్పవచ్చు .
ప్రతి రోజు పోలీసువారు జప్తు చేస్తున్న డబ్బే ఈ ఎన్నికలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నదనడంలో ఎవరికీ అనుమానం లేదు.
ఎవరు ఎంత ఎక్కువ ఖర్చు పెడుతున్నారో వారికి విజయం దక్కడం ఖాయమైతే ,భగవంతుడా నీవే ఈ దేశాన్ని రక్షించు
అని ప్రార్ధించడం మినహా ప్రజాస్వామిక వాదులు చెయ్యగలిగింది ఏమి లేదు .